Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ వల్ల తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు కొట్టగా, ఈ ఏడాది జనగాం, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు.

మారుముల జిల్లాల్లో సైతం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు చేరబోతున్నట్లు వెల్లడించారు. 2014లో ఎంబిబిఎస్ సీట్లు 850 ఉంటే ఇప్పుడు 2,790 ఉన్నట్లు తెలిపారు. ఎంబిబిఎస్ సీట్లు మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగిందని అన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. మెడికల్ సీట్ల విషయంలో దేశంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని గుర్తు చేశారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పిజి సీట్లతో తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటులో చూస్తే, 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 71శాతం పెరిగితే, తెలంగాణలో 240 శాతం పెరిగిందని అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మంత్రి జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని సూచించారు. అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News