Sunday, November 24, 2024

ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన : హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఖండించారు. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజా పాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

తామే నియామకాలు చేపట్టినట్లు చెప్పడం విడ్డూరం : బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 నియామకాలు చేపట్టిందని, కానీ నియామకాలపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అసత్య ప్రచారం చేయడం దారుణమని హరీష్‌రావు పేర్కొన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ వాటికి నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు నిర్వహించింది, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కేసీఆర్ హయాంలో అని వెల్లడించారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ పడిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, తామే నియామకాలు చేపట్టినట్లు చెప్పడం విడ్డూరమన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నామని కేవలం తెలంగాణనే కాదు. యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News