Thursday, January 30, 2025

ప్యాలెస్ నుంచి కాంగ్రెస్ ప్రజాపాలన:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మరోసారి నిప్పులు చెరిగారు. ప్రజా పాలన అంటివి..సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బర్ అంటివి..ప్రతి రోజు ప్రజలు కలుస్తా అంటివి..కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేస్తివి అని విమర్శించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా, దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నవు ఎందుకు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్‌కు పిలిపించుకుని, అహంభావం ప్రదర్శిస్తున్నవని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News