Friday, December 27, 2024

ఎపిలో చెల్లని రూపాయి….తెలంగాణలో చెల్లుతుందా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఎపిని అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు తెలంగాణకు వచ్చి కాకమ్మ కబుర్లు చెబుతున్నాని ఎద్దేవా చేశారు. తెలంగాణను అత్యంత వెనకబడేలా చేసిందే చంద్రబాబు అని విమర్శించారు. సూర్యుడు ఉదయిస్తోంది తన వల్లే, కోడి కూస్తోంది తన వల్లే అని అనే బాపతు చంద్రబాబుదని మండిపడ్డారు. చంద్రబాబులా మాట్లాడితే తమ దేశంలో అయితే జైలుకు పంపుతారని అని అప్పటి స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేశారు.

రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని అన్నారు.టిడిపి పాలనలో కరెంటు చార్జీలు తగ్గించమంటే… బషీర్ బాగ్‌లో రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టింది కూడా చంద్రబాబేనని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు…. 2004 లో తమ ఓటమికి రైతులను నిర్లక్ష్యం చేయడమే కారణమని వ్యాఖ్యానించిన విషయాన్ని మరిచిపోయారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బాబు మరచి పోయినా తెలంగాణ ప్రజలు మరచిపోరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News