స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది..? అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై ఆయన అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదని, సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారని పేర్కొన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు అని, అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడిందని ఆరోపించారు. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగామని, 15 నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదని తెలిపారు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదని, స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా తాము సిద్ధం అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయని అన్నారు.
స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది..?:హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -