Friday, January 24, 2025

అమిత్ షా, మల్లిఖార్జున్ ఖర్గేలు రాజకీయ టూరిస్టులు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో యాతాకుల భాస్కర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు, భాస్కర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నినాదాల పార్టీ కాదు, నిజం చేసి చూపించే పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించేవాళ్లు రాష్ట్ర పరిస్థితి చూసి మాట్లాడాలన్నారు. నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువైయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మల్లిఖార్జు్ ఖర్గేలు రాజకీయ టూరిస్టులని మంత్రి విమర్శించారు. అంబేడ్కర్ ఆశయాలను నిజయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. బిఆర్ఎస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News