Wednesday, December 25, 2024

మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు బోనస్ రూ.500 ఇస్తున్నామని చెప్పారని… ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్ అన్ని అబద్దాలు పెట్టారని విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు చేశామని అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఫైరయ్యాడు. కాగా, నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారంల పాల్గొనేందుకు ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News