Saturday, February 22, 2025

ఎపి జలదోపిడీపై రేవంత్‌రెడ్డి మౌనం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రయోజనాల
పరిరక్షణకు ప్రధాని మోడీ
ఇంటి వద్ద ధర్నా చేద్దాం
బాబుకు ముఖ్యమంత్రి
రేవంత్ గురుదక్షిణ
చెల్లించుకుంటున్నారా?
హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జ లాల దోపిడీపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మౌ నంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీష్‌రావు మండిపడ్డారు. సిఎం వికారమైన భాషతో ప్రతిపక్షాల మీద ఎగిరిపడటం కాకుండా నీటి తరలింపుపై మాట్లాడాల ని హితవు పలికారు. రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీ వ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే, కాంగ్రెస్ నీళ్లు నములుతోందని విమర్శించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ పది వేల క్యూసెక్కులు మూడు నెలలుగా పోతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తాత్కాలిక వాటా అయినా 512 టిఎంసిలకు మించి 657 టిఎంసిలు ఎపి తీసుకుపోయిందని, 25 రోజుల్లోనే 65 టిఎంసిల నీటిని తరలించారని చెప్పారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా..? అని ప్రశ్నించారు.

అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు పెనుశాపంగా మారిందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని, కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, ఢిల్లీలో ధర్నా చేయాలని, అందుకు తాము కూడా కలిసివస్తామని చెప్పారు. ప్రధాని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్ధామని అన్నారు.

నాగార్జునసాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి లేకుండా ఎపి ఇష్టారీతిన నీటిని తరలించుకుపోతోందని హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు, చంద్రబాబును అడిగే దమ్ము లేదని ఆరోపించారు. శ్రీశైలం, సాగర్ నీటిని తరలించుకుపోతుంటే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది 1015 టిఎంసిల నీరు కృష్ణాలోకి వచ్చిందని, ఎపికి కేవలం 9 టిఎంసిల హక్కు మాత్రం ఉందని, కానీ ఇప్పుడు కూడా ఎపికి నీరు తరలిస్తూనే ఉన్నారని చెప్పారు. 220 టిఎంసిలు మాత్రమే తెలంగాణ వాడుకుందని, ఇంకా 123 టిఎంసిలు రావాలని తెలిపారు. తెలంగాణ ఇప్పటికే నష్టపోయిందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.

నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం..
యాసంగి పంట కింద ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని హరీష్‌రావు పేర్కొన్నారు. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు ఏసుకున్నారని, సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలని తెలిపారు. హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయని, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఎపి నీరు ఆపేలా చూడాలని అన్నారు. సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది కాబట్టే ఎపి ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకుపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని చెప్పారు. కృష్ణా బోర్డు కేంద్రం నియంత్రణలో ఉందా..? లేక ఎపి నియంత్రణలో ఉందా..? అని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో..?
బిజెపి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి ఏం లాభం..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీళ్ళు తెస్తారా…? చంద్రబాబుకు వత్తాసు పలుకుతారా..? అని అడిగారు. రాష్ట్రం కోసం ఉపయోగపడని పదవులు ఎందుకు..? అని అడిగారు. నాగార్జున సాగర్ నుంచి సిఆర్‌పిఎఫ్ బలగాలు ఉపసంహరించాలి, లేదంటే శ్రీశైలంలో కూడా పెట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుట్వానికి చేత కావడం లేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా చూడాలని సూచించారు. ప్రాజెక్టులకు అనుమతులు తేవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, 15 నెలలు అయినా ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది, డిపిఆర్‌లు వెనక్కు వచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టారని, ఆర్నెళ్లలో మరమ్మత్తులు పూర్తి చేసే అవకాశం ఉన్నా చేయడం లేదని పేర్కొన్నారు.

ఎపి యథేచ్చగా నీరు తీసుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కెసిఆర్ ప్రతినిత్యం కృష్ణా జలాల సమీక్ష చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు సిఎం, మంత్రి కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత పాలకుల పుణ్యం కారణంగానే తెలంగాణకు 299 టిఎంసిల తాత్కాలిక కేటాయింపు జరిగిందని, తెలంగాణకు 575 టిఎంసిల నీరు తెచ్చుకునేందుకు సెక్షన్ 3 దోహదపడుతుందని చెప్పారు. కేవలం నిర్లక్ష్యం, వైఫల్యం, లొంగిపోయిన కారణంగానే నీటి దోపిడి జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం లేకపోవడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందువల్లనే నీటిని తరలించుకునేందుకు చంద్రబాబుకు సులువు అయిందని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు జలదోపిడీ జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య పరోక్ష సంబంధం ఉందేమో అని, చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో..? అని హరీష్‌రావు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News