Sunday, April 13, 2025

కెసిఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టిండు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైరయ్యారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. ఏడాదిన్నరలోనే రేవంత్ పడగొట్టిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డిలో మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేదని.. కానీ, ఇప్పుడు దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జిఎస్టి వృద్ధిరేటు పడిపోయిందని విమర్శించారు.

దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే.. తెలంగాణ కేవలం 5శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నదని.. ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్ళేవో అర్థం అయిపోయిందన్నారు. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప.. చేతలు లేవు అన్నది ప్రజలకు అర్థమయిందని అన్నారు. కేసీఆర్ సాగు భాష మాట్లాడితే.. రేవంత్ రెడ్డిది సావు భాష మాట్లాడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News