Wednesday, January 22, 2025

కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి పక్కా ప్లానేనని రేవంత్ ఒప్పుకున్నట్లే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్‌రెడ్డి హుందాగా మాట్లాడాలని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు హితవు పలికారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్‌రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడచూసినా కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్ సర్కార్ గద్దె దింపేశారని గుర్తు చేశారు. ఐదేళ్లకు మించి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, గాంధీ భవన్‌లో సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సిఎం తన మీద ఇష్టానుసారం మా ట్లాడారని, తనకు అలా మాట్లాడం రాదా..? అని.. కానీ సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు.

“నువ్వు లిల్లీఫూట్ అంత లేవు అని అనలేనా..? నేను నిన్ను సన్నాసి అనడం పెద్ద కష్టమైనా పనా..? నా ఎత్తు గురించి దుర్భషలాడుతున్నావు. నా ఎత్తు మీద నీకు అంత ఈర్ష్య ఎందుకు..? ఎంత తిట్టినా.. ఎంత మాట్లాడినా నా అంత ఎత్తు పెరగలేవు… నేను పొడుగే.. తెలంగాణ ఉద్యమం మరింత పొడుగు చేసింది. కానీ నువ్వేంది.. నీ బుద్ది కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ.. నీ కురచతనం వల్ల నా పొడుగు గురించి మాట్లాడి నీ విలువ తగ్గించుకుంటున్నావ్‌” అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. తన ఎత్తు గురించి మాట్లాడటం మానేసి.. రైతుల గురించి ఆలోచించాలని, ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు అని సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

అసలు గాంధీ ఎవరి వాడు?
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్ చేసిందే రేవంత్‌రెడ్డి అని ఆయన వ్యాఖ్యలతో రూఢి అయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు ఏమో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కొట్టుకున్నరు..కానీ అది కాంగ్రెస్ చేసిందని ప్రచారం చేస్తున్నారని అంటున్నారని పేర్కొన్నారు. అరికెపూడి గాంధీ తమ ఎంఎల్‌ఎ కాదు అని శ్రీధర్‌బాబు అన్నారని…సీఎం మాటలు చూస్తే తానే దాడి చేయించా అని అంటున్నారని…అసలు గాంధీ ఎవరి వాడు అని హరీశ్‌రావు అడిగారు.

రుణమాఫీపై చర్చకు సిద్ధమా..?
రాష్ట్రంలోని రైతాంగానికి రుణమాఫీ పూర్తి చేశాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా రు.. ఒక వేళ నిజంగానే రుణమాఫీ జరిగితే.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సిఎం స్వగ్రా మం కొండారెడ్డిపల్లికే పోదాం.. అక్కడే చర్చ పెట్టి తేలుద్దాం అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రా వు సవాల్ విసిరారు. డేట్, టైమ్ చెప్పు నేను వస్తా.. రైతులకు రుణమాఫీ అయిందా..? అ ని నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలో అడుగుదాం పదా.. అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News