Monday, December 23, 2024

మూసీపై అఖిలపక్షం పెట్టండి

- Advertisement -
- Advertisement -

మన రేవం త్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. బిఆర్‌ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన మూసీ ప్రాంత బాధితులతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. బా ధితులు బిఆర్‌ఎస్ నేతలు, న్యాయవాదుల ముందు తమ గోడు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యా యి. ఈ సందర్బంగా వారి ఆవేదన విన్న హరీశ్‌రా వు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం బాధితులను ఉద్దేశిస్తూ హరీశ్‌రావు మాట్లాడుతూ,

పేదల ఇళ్లు కూల్చేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతిస్తా రా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వా త ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. కెసిఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని గుర్తు చేశారు. వంద రోజు ల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పె ట్టాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సిఎంకు లేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారంటూ ప్ర శ్నించారు. అందుకే బాధితులకు రక్షణ కవచంలా గా బిఆర్‌ఎస్ ఉంటుందని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

బుచ్చమ్మది ప్రభుత్వ హత్య
కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ ది ఆత్మహత్య కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, కూకట్‌పల్లి ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావులు గాంధీ మార్చురీకి వె ళ్లారు. అక్కడ మార్చురీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అ నంతరం బుచ్చమ్మ పార్థివ దేహాన్ని చూసి, మృతురాలి కుటుం బ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ,

ఎవరికోసం ఈ మూసీ సుందరీకరణ..?..ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు..? అని ప్రశ్నించారు. మూసీలో నీళ్లు పారించాలనుకుంటున్నావా..? రక్తం పారించాలనుకుంటున్నారా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. వెంటనే హైదరాబాద్ ఎంఎల్‌ఎలతో ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్‌లో చిన్న చిన్న మందులకు రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పారాసిటమల్ మాత్రలు కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నమెం ట్ హాస్టళ్లలో, స్కూళ్లలో పురుగుల అన్నం పెట్టి విద్యార్థులను ఈ ప్రభుత్యం వేధిస్తుందని హరీశ్ ఆరోపించారు.

హైదరాబాద్ కు ఉన్న పేరును నిలబెట్టేవిధంగా పని చెయాలని కోరా రు. 30 ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పరచుకున్న వారి ఇళ్లు కూ ల్చే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పేదలను నిర్వాసితులను చేస్తే ఇం టికి పరిహారమివ్వాలన్నారు. కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని పే ర్కొన్నారు. జీవన భృతి కింద రూ.5 లక్షలు ఇవ్వాలని కాంగ్రె స్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఉపాధి పోయి ఇల్లు పోయి ప్రజలు రోడ్డు మీదకు వ స్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఆరోపించారు.

ఆత్మహత్య చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి
రేవంత్ రెడ్డి సోదరునికి నెల రోజుల ముందు పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కల్పించారని, పేదవారి ఇండ్లను ఎందుకు నో టీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పేదవారికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి సోదరులకు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారని దుయ్యబట్టారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలని హరీశ్‌రావు ప్రజలను కోరారు. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరూ ప్రాణం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News