Thursday, December 26, 2024

మూసీ బాధితుల ఇళ్లకు రక్షణ కవచంలా నిలబడతాం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలోని హైదర్శకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. అతని తమ్ముడి ఇల్లు FTLలో ఉంది. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా??. మీరు ధైర్యంగా ఉండండి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచే ప్రశ్నే లేదు” అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News