ముందుంది అసలు సినిమా
రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన రైతుభరోసా ఏమైంది?
రైతురుణమాఫీకి లేని సొమ్ము మూసీ ప్రాజెక్టుకు ఎక్కడిది?
కోరుట్ల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ పాదయాత్ర సందర్భంగా జగిత్యాల
కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: రైతుల రుణమాఫీకి లేని సొమ్ము మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు ఎ క్కడివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎం ఎల్‌ఎ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు రైతుల సమస్యలు తీర్చాలని మంగళవారం జగిత్యాల జిల్లా, కోరుట్ల నుండి జగిత్యాల వరకు కోరుట్ల ఎంఎల్‌ఎ సం జయ్‌కుమార్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు హాజరైన హరీశ్‌రావు జగిత్యాల కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా ఏమైందని సి ఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రైతు ల బాగుకోరే సిఎం కెసిఆర్ అయితే బూతుల సిఎం రేవంత్‌రెడ్డి అని వ్యా ఖ్యానించారు. సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముం దుంది అసలు సినిమాఅని అన్నారు.
రైతుల ధాన్యం క్వింటాల్‌కు రూ. 2280తో పాటు రూ.500బోనస్‌తో రూ.2800 రైతుకు గిట్టుబాటు రావాలని, కానీ ప్రస్తుతం రూ.1800లకు కొనుగోలు చేసి రూ. వెయ్యి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోనస్, రైతుబంధు, రుణమాఫీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అ సెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ల మీద రేవంత్‌రెడ్డి ఓట్లు పెట్టి రైతులను మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ చేస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తా అ ని తాను అన్నానని, కానీ ఇంకా రైతులకు రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. ఆగస్టు 15, దసరా, దీపావళికి చేస్తామని హామీ ఇచ్చుకుంటూ మళ్లీ డిసెంబర్ 9కి అంటున్నారని ఎద్దేవా చేశారు. వడ్డీతో సహా రుణమాఫీ, బోనస్, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పాదయాత్రలో మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎంఎల్‌సి ఎల్ రమణ, బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తల జేబుల నుండి దొంగలు హస్తలాఘవం ప్రదర్శించి, మని పర్సులు కొట్టేశారు. అయితే, అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.