Wednesday, December 25, 2024

కెసిఆర్ కలుపు మొక్క కాదు.. కల్పవృక్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కలుపు మొ క్క కాదని..కల్పవృక్షం అని మాజీ మం త్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు అ న్నారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లకా్ష్మరెడ్డి, చిట్టెం రాం మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులతో కలిసి బుధవారం ఆయన దేవరకద్ర నియోజకవర్గం,
సిసికుంట కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ..ఇవ్వాల రైతులు టివిల దగ్గర తమ పిల్లలను కూర్చోనీయడం లేదని.. పొరపాటున టివి ఆన్ చేస్తే సిఎం రేవంత్ రెడ్డి బూతు మాటలే వినిపిస్తున్నాయని, ఒక సిఎంగా ఉండి ఆ బూతులు ఏంది.. అలా మాట్లాడవచ్చునా? అందుకే కెసిఆర్ రైతు సిఎం అయితే, రేవంత్‌ను బూతుల సిఎం అని జనం అంటున్నారని ఎద్దేవా చేశారు. ‘కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెబుతున్నా .. ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చారు.. మరి ఆ మాటపై నిలబడ్డారా.. నేను వస్తూ వస్తూ నిల్విడి గ్రామంలో రుణమాఫీ అయ్యిందా అని రైతులను అడిగాను.. వారు కాలేదు’ అని అన్నారని తెలిపారు.

ఇటీవల రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చారని, అయితే మాటతప్పానని కురుమూర్తి స్వామి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అనుకున్నాను..కానీ ఆయన చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు… కనబడిన చర్చిల మీద, దర్గాలు, దేవాలయాల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తానన్నారు.. మాట మీద నిలబడ్డారా? సిఎం రేవంత్‌కు మాటలు ఎక్కువ చేతులు తక్కువ’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ వరంగల్ సభలో సిఎం 45 నిమిషాలు ప్రసంగం చేస్తే కెసిఆర్‌ను 50 సార్లు గుర్తు చేసుకున్నారని..అంటే రేవంత్‌కు నిద్రలో కూడా కెసిఆరే గుర్తుకు వస్తున్నారని, అయినా కెసిఆర్‌ను లేకుండా చేస్తానంటున్నారని ధ్వజమెత్తారు. ‘పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికే అరిస్టం అంటారు…పాలకుడు దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్మున్ని కాపాడాలని కురుమూర్తి స్వామిని దర్శించుకొని కోరుకున్నాం’ అన్నారు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటికీ సగం కంటే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. ‘గిదంతదానికి హరీశ్‌రావు రాజీనామా చెయ్..

అంటున్నారు…నేను రెడీగానే ఉన్నా.. రైతులకు మేలు జరిగితే రాజీనామాకు సిద్ధంగా ఉన్నా’ అని అన్నారు. వరంగల్‌లో గతంలో ఇదే పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది…ఇందులో 9 రకాల హామీలు ఇచ్చారన్నారు. మరి ఇందులో ఒక్కటైనా అమలు చేశావా అని నిలదీశారు. ‘వరంగల్ డిక్లరేషన్‌లో రైతు బంధు పదిహేను వేలన్నారు..అది అమలు కాలేదు..అన్ని రకాల పంటలకు బోనస్ అన్నారు.. రైతు రుణమాఫీ అన్నారు ..సగం కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు….రైతు కూలీలలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇదీ అమలు కాలే… ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటంటే అమలు చేశావా’ అంటూ నిలదీశారు. ‘ఇవ్వాల మహబూబ్ నగర్ జిల్లా ప్రజల పరువు తీస్తున్నారు.. పాలమూరు ప్రజలు అంటే నీతిbంతులు, మాట తప్పనోళ్లు..కానీ ఈ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి మాట తప్పి పాలమూరు పేరును చెడగొడుతున్నారు’ అని విమర్శించారు. ప్రతిపక్షంపై పగ పట్టడం.. ప్రజలకు దగా చేయడమే రేవంత్ ఎజెండా అని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు, కెసిఆర్ కిట్లు..న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ పండుగ చీరలు, గొల్ల కుర్మలు గొర్రెలు, బిసి బంధు, దళిత బంధు ఇలా అన్నీ కోల్పోయింది నిజం కాదా అని నిలదీశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రకాల ట్యాక్స్‌లు వచ్చాయన్నారు. బిల్లులు కావాలంటే 8 నుంచి 10 శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తోందన్నారు. ఇళ్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చిందన్నారు. చదరపు గజానికి వంద రూపాయలు ఇవ్వాలట. కొత్త ట్యాక్సులు వచ్చాయన్నారు. రెండు లక్షలు పైగా ఉన్న వారు రుణం కట్టుకోండంటే రైతులు బంగారు తాకట్టు పెట్టి వడ్డీలు తెచ్చుకొని అప్పు చెల్లిస్తే వారికి ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదన్నారు. రేవంత్ రెడ్డి మెడలు వంచైనాసరే ఆరు గ్యారెంటీలు అమలు చేయిస్తామన్నారు. ‘కెసిఆర్ పరిపాలనలో రైతులు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే. ఇవ్వాల కనీసం లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు కూడా పండించుకోలేక పోయారు.. పండించిన వడ్లును కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. వడ్లు కొనడానికి చేతకాని సిఎం మద్యాన్ని ఇంకా ఎక్కువ తాపించనందుకు ఎక్సైజ్ వారికి మెమోలు జారీ చేశారు’ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు నెలలు కష్టపడితే పూర్తి అవుతుందన్నారు. శ్రీశైలంలో ఈ ఏడాది వందల టిఎంసిల నీరు వృధాపోయిందని తెలిపారు.

బిఆర్‌ఎస్ హయాంలోనే అన్ని ప్రాజెక్టులు పనులు జరిగాయన్నారు. రైతులకు లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఇళ్లు కట్టకపోగా హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతోందని ఆరోపించారు. ఇది న్యాయమేనా అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్‌కు గోరీ కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News