Tuesday, December 24, 2024

రైతుబంధును ఎగవేసిన ప్రభుత్వ పెద్దలను నిలదీయండి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రైతుబీమాకు కాంగ్రెస్ సమాధి కట్టింది
ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే ముక్కు నేలకురాస్తా: హరీశ్‌రావు

మెదక్: ప్రశ్నించిన వారిపై పగబట్టే వైఖరితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎం ఎల్‌ఎ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలను, రైతులను అణగదొక్కుతూ నియంతపాలన కొనసాగిస్తూ అందరినీ భయందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తన యేడాది పాలనలో ఒర్లుడు తప్పా ఓదార్చిందేమీ లేదన్నారు. అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమివ్వక అబద్ధ్దాలు మాట్లాడి హద్దులు దాటి ప్రవరిస్తూ అసెంబ్లీనే అపవిత్రం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వందశాతం రైతుబంధు ఏగ్రామంలోనైనా పూర్తయిందని చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేదా నువ్వు రాస్తావా అంటూ సిఎంకు సవాల్ విసిరారు.

కెసిఆర్ తీసుకొచ్చిన రైతుబంధును రేవంత్ సర్కార్ బొందపె ట్టిందని, రైతుబీమాను సమాధి చేసిందని హరీశ్‌రావు మండిప డ్డారు. రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చా రు. సకాలంలో ధాన్యాన్ని కొనలేక అన్నదాతలు దళారులను ఆశ్రయించి మోసపోయారని, దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వడ్లు కొనని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రంలో పండిన పంట ను సగమైనా కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. పాలసీలను అడిగితే పోలీసులను ఇంటికి పంపిస్తున్నారని, దీంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగి రికవరీ రేట్ తగ్గిందన్నారు. రాష్ట్రంలో ఎంత చెత్త పాలన కొనసాగుతుందో ప్రజలకు అర్థమవుతోందని ఎద్దేవా చే

శారు. రేవంత్ సిఎంగా, హోంమంత్రిగా వైఫల్యం చెందడంతో రాష్ట్రంలోని సంవత్సర కాలంలో 9 సార్లు మతకల్లోలాలు జరిగి శాంతి భద్రతలు అదుపు తప్పాయని అ న్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చారన్నారు. తమ పదేళ్ల పాలనలో కేవలం నాలుగు లక్షల 17 వేల కోట్ల అప్పు చేయగా కేవలం కాంగ్రెస్ వచ్చిన ఒక్క సంవత్సరంలోనే లక్షా 25 వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోగా ఉన్న పథకాలను బం ద్ చేసి రాష్ట్ర రైతుల, ప్రజల ఉసురు పోసుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇప్పటికైనా ఖరీఫ్, యాసంగి కలిపి రూ.15 వేలు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులకు సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారే ఏమి మాట్లాడుతున్నారో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎకరం లోపు భూమున్న రైతులను వ్యవసాయ కూలీలుగా గుర్తించి వారికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రైతులకు కోతలు లేకుంటే అన్ని ఉత్పత్తులు బాగుంటాయన్నారు. ఈ నెల 25న సిఎం మెదక్‌కు వస్తున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఒట్టేసి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని ఏడుపాయల వనదుర్గామాత, ఏసుప్రభు ముందు ఆత్మప్రక్షాళన చేసుకుని ప్రాయశ్చిత్తం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ, పార్టీ జిల్లా అద్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రంగౌడ్, బట్టి జగపతి, మామిళ్ల ఆంజనేయులు, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సోములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News