2024లో అన్నింటా ప్రభుత్వం వైఫల్యం సిఎంకు ఢిల్లీ పర్యటనల ధ్యాసే
తప్ప.. గురుకులాల మీద పట్టింపు లేదు ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ
అవతారం మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శ
మన ప్ర భుత్వ పరంగా 2024లో ఎందు లో చూసినా విజయాల కన్నా.. వై ఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో గత సంవత్సరం కాంగ్రెస్ పాలనపై మంగళవారం హరీశ్‌రావు పత్రికా ప్రకట న విడుదల చేశారు. ఎన్నికల స మయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్.. రాయి కా దు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. అభయ హస్తం ప్రజలను భయపెట్టే, బాధపెట్టే హస్తంగా మారిందని వ్యాఖ్యానించారు. వంద రోజు ల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదని పేర్కొన్నారు. గ్యారంటీలు అమలు చేయమం టే గారడీ విన్యాసం చేస్తున్నార ని విమర్శించారు. ఏడాది పాల న తర్వాత అనేక సర్వే ఏజెన్సీ లు ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు చేశాయని, ఏ స ర్వేలో రేవంత్‌కు పాస్ మార్కులు కూడా రాలేదని అన్నారు. ఎవరిని అడిగినా రేవంత్‌ను తిడుతున్నారనే సమాధానం వస్తోందని చెప్పారు.
డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే పగబడుతున్నారు ..పాలసీ ఏదీ అంటే పోలీసులను పంపుతున్నారని, కిట్ల స్థానం లో కాంగ్రెస్ మార్కు తిట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికలపుడు బోనస్ మాటలు.. ఇప్పుడేమో బోగస్ మాటలు అని, ఎన్నికలప్పుడు అన్ని పంటలకు బోనస్ అన్నారు..ఇప్పుడు ఒక పంటకు మాత్రమే అంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయని, రుణ మాఫీ చివర విడత చెక్కు అని హంగామా చేశారు ..ఇంకా డబ్బులు రైతుల అకౌంట్లలోనే జమ కాలేదని చెప్పారు. వరంగల్‌లో మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కుల డబ్బులు కూడా వారికి చేరలేదని, విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు చెప్పిందే పోలీసులు అమలు చేస్తున్నారు
బిఆర్‌ఎస్ నాయకులపై క్షణాల్లో కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చెప్పిందే పోలీసులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ధ్యాసే తప్ప కమిట్‌మెంట్ లేదని పేర్కొన్నారు. కెసిఆర్ గొప్పగా నెలకొల్పిన గురుకులాలను గాలికి వొదిలేశారని, విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎంకు ఢిల్లీ పర్యటనల ధ్యాసే తప్ప.. గల్లీల్లో ఉన్న గురుకులాల మీద పట్టింపు లేదని ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉత్తవే అయ్యాయని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు అని 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వక్ర మార్గం పట్టిస్తున్నారని, అయితే లాఠీ లేకపోతే లూటీ అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని వ్యాఖ్యానించారు. అప్పులపై అబద్దాలే ..హామీల అమలుపై అబద్దాలే..అసెంబ్లీలో కూడా అడ్డు అదుపు లేకుండా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శ్రుతి మించుతున్నాయి
అంబేడ్కర్ రాజ్యాంగం పోయి అనుముల రాజ్యాంగం వచ్చిందని హరీష్‌రావు పేర్కొన్నారు. రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శ్రుతి మించుతున్నాయని ఆరోపించారు. హైడ్రా పేరిట సామాన్యులకు నిద్ర లేకుండా చేశారని, హైదరాబాద్ ఇమేజీని డామేజ్ చేశారని చెప్పారు. రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నారని విమర్శించారు. ప్రజల బ్రతుకులు మార్చుతామని నమ్మించి గద్దెనెక్కి తెలంగాణ తల్లిని మార్చారని ఎద్దేవా చేశారు. పోలీస్ లోగో మాత్రం మారింది…టిఎస్ నుండి టిజిగా మారిందని, ఇప్పుడు రాష్ట్ర లోగో కూడా మార్చుతామని అంటున్నారని, అయితే, ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మారితే రేవంత్ తప్పులు ఒప్పులు అయితాయా..? అని ప్రశ్నించారు. చివరకు ఫిరాయింపులపై కూడా రేవంత్ తన మాటను ఫిరాయించేశారని, అవకాశ వాదానికి రేవంత్ మరో పేరుగా మారారని విమర్శించారు.
కాంగ్రెస్, బిజెపిల స్నేహం ఏడాదిలో మరింత బలపడింది
కాంగ్రెస్, బిజెపిల స్నేహం ఏడాదిలో మరింత బలపడిందని హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం చిన్న రిపేరును కూడా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేరని అన్నారు. లగచర్లలో సిఎం భూ దందా బయటపడిందని, అమాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అది మెట్రో అయినా ఫార్మా ప్రాజెక్టు అయినా ప్రభుత్వానికి ఏ విజన్ లేదని విమర్శించారు. అప్పులు అగాధంగా పెరిగాయి…అభివృద్ధి అదో పాతాళానికి వెళ్ళిందని పేర్కొన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ అవతారం, రేవంత్ రావణాసుర రూపం బయట పడ్డాయని ఘాటు విమర్శలు చేశారు.
ప్రజలు ఏం కోల్పోయామో గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడం వల్లే ప్రజలకు మేలు జరుగుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉందని, ఆరు గ్యారంటీలతోపాటు, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 420 అంశాలను అమలు చేయాలని హితవు పలికారు. రాజకీయ కక్షలు మానండి..- రాష్ట్రం అభివృద్ధి కక్ష్యలో పరిభ్రమించేట్టుగా పాలన సాగించాలని హరీష్‌రావు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.