Thursday, January 9, 2025

రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చినా.. రూ.4 వేల పింఛన్‌ ఇస్తలేరు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగానలో సంక్షేమ పథకాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. రైతులను, మహిళలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఏడాది పాలనలోనే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు.

కేసీఆర్‌ కిట్‌ వస్తలేదు.. రైతు భరోసా లేదు.. రూ.4 వేల పింఛన్‌ ఇస్తలేరు.. మరి, రాష్ట్ర ఆదాయం, తెచ్చిన అప్పులు ఎక్కడికి పోయాయని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. సంక్షేమ పథకాలకు పైసలు లేవు.. ఫ్యూచర్‌ సిటీ, మెట్రోకు ఎక్కడి నుంచి వస్తాయిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ధ్వజమెత్తారు. వానాకాలం రైతుబంధు కూడా ఇవ్వట్లేదన్నారు. ఏపీలో పెంచిన పింఛన్‌లు అమలు చేస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం అమలు చేయడం లేదని మాజీ మంత్రి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News