Thursday, March 13, 2025

బిఆర్‌ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటావు అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరగా సిఎం ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కెసిఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కెసిఆర్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు నియాక పత్రాలు ఇచ్చారని అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం అని చెప్పారు. ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 5, 6 వేలు మించి లేదనేది వాస్తవం అని పేర్కొన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా కెసిఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News