Thursday, January 23, 2025

మాజీలయ్యే వరకు నిద్రపోం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రామచంద్రపురం: తమ పార్టీ మారి, కాంగ్రెస్ పంచన చేరిన ఎంఎల్‌ఎలను మా జీలను చేసేవరకు విశ్రమించబోమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్ రావు స్ప ష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం లో భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆద ర్శ్ రెడ్డి నివాసంలో పటాన్చెరు నియోజకవర్గ కా ర్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు శాసనమండలి మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పార్టీకి నమ్మకద్రోహం చేసిన స్థానిక ఎంఎల్‌ఎ మహిపాల్ రెడ్డిని మాజీ చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు.

తమ పార్టీని కొందరు ఎంఎల్‌ఎలు తమ స్వార్థానికి వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. గూడెం మహిపాల్ రెడ్డికి బిఆర్‌ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని, మూడుసార్లు టికెట్ ఇచ్చి ఎంఎల్‌ఎగా గెలిపిస్తే నమ్మకద్రోహం చేశాడని మండిపడ్డారు. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ గులాబీ జెండానే ఎగరడం ఖాయమని అన్నారు. మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారని, పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చామని, రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించి నిధులు వరద పారించామని గుర్తు చేశారు.

‘గూడెం’ పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. 2001లో కెసిఆర్ పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించారని, అప్పుడు కూడా కుట్రలు జరిగాయని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12 మంది ఎంఎల్‌ఎలను తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదని, న్యాయం గెలిచిందని, కెసిఆర్ 14 ఏళ్లు పోరాడి, రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందనన్నవాళ్లు తర్వాత కనిపించకుండాపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలందరూ గమనిస్తున్నారని, కెసిఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని వ్యాఖ్యానించారు. రుణ మాఫీ విషయంలోనూ ద్వంద్వవైఖరి రైతులను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, జీవో ఇచ్చేది ఒకరకంగా నోటి మాటలు మరోలా ఉన్నాయని ఆరోపించారు.

గడచిన ఆరు నెలలుగా కాంగ్రెస్ మోసపూరిత బుద్ధి బయటపడిందని, ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్సేనని, అంతా ధైర్యంగా ఉండాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పనిచేసి గెలుద్దామని కార్యకర్తలకు ఉత్తేజానిచ్చారు. కాంగ్రెస్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదేళ్లకు మించి అధికారంలో లేదని, ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ సరిగ్గా అమలు కాలేదు. ఫ్రీ బస్సు అంతా తుస్సే అని, ఆ బస్సులోనూ లొల్లులే ఉన్నాయన్నారు. ప్రజలు కాంగ్రెస్ లీడర్లను వదిలిపెట్టరని, పరిపాలన స్తంభించిందని, జీతాలు అందక పాలేంటే.. నీళ్లేంటో తెలిసిపోతోందన్నారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని, పార్టీ మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News