Sunday, December 22, 2024

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతోంది:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రంగులు మార్చే ఊసరవెల్లి సైతం భయపడుతోందని బిఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సభలో ప్రశిస్తే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడలేదని, ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరణ చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని, మరీ ఆయనకు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారోనని సెటైర్ వేశారు.

మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక సభను వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయ్యిందని, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. గ్రూప్1 మెయిన్‌ను 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మరీ ఇప్పుడు ఎందుకు ఆ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం లేదని నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

ఈ కారణంగా మెగా డిఎస్సీని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో అధికార బలంతో ప్రభుత్వం తమ గొంతు నొక్కేసిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోలేదని అన్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధంచి ఏప్రిల్, మే నెలలో డబ్బులు ఇంకా వేయలేదని అన్నారు. ఆ అంశంపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారిలో ఎమ్మెల్యేలు సునీత లకా్ష్మరెడ్డి, సబితా ఇ్ంరద్రారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News