Monday, December 23, 2024

ఎల్‌ఆర్‌ఎస్‌పై మాట తప్పిన కాంగ్రెస్: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హామీల అమలుపై మాట తప్పడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరిస్తామని చెప్పిన కాంగ్రెస్..నేడు మాట తప్పిందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరిట ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్…నో బిఆర్‌ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా..గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి పీజులు లేకుండా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News