Monday, December 23, 2024

రుణమాఫీ కాలేదంటే రైతుల అరెస్టులా?

- Advertisement -
- Advertisement -

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదనే విషయాన్ని కాంగ్రెస్ పాల కులు మరిచిపోయినట్లు ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు రుణమాఫీ అమలు కాని ఎంతో మంది రైతులు నిరసన తెలుపు తుండగా వారిని అరెస్టు చేయడాన్ని హరీశ్ రావు ఖండించారు. ఇది వారి హక్కులను కాలరాయడమే అని విమర్శించారు. “ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న రైతులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.

ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సిఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బిఆర్‌ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం’ అని హరీశ్ రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News