Friday, December 27, 2024

నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీశ్‌రావు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు
మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీశ్‌రావు ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదు.. మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందని మండిపడ్డారు. 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి నెలకొందని వాపోయారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని అన్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సిఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. మాటలే తప్ప చేతలు లేని సిఎం నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News