Monday, December 23, 2024

పట్టపగలు పచ్చి అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
చేరి ఉంటే క్షమాపణ చెబుతారా? 
ఎన్నడూ లేనివిధంగా రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలా?
 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

కేంద్రానికి రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ. రాష్ట్రానికి వచ్చింది తక్కువ. దేశాన్ని, ఇతర రాష్ట్రాలను సాకడంలో తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రభుత్వ వాటా ఉంది. మరి తెలంగాణ ప్రతినిధిగా సిఎం కెసిఆర్ ఫొటో ఆ రాష్ట్రాల్లో పెడతారా?

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటుచేయాలంటూ స్థాయిని దిగజార్చుకునే విధంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవరిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మల వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థా యిని దిగజార్చే విధంగా నిర్మల తీరు ఉందన్నారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు. రేషన్ షాపులో ఎవరి ఫొటోలు పెట్టలేదు.. చరిత్రలో లేనివిధంగా తమ స్థాయిని దిగజార్చుకునేలా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారన్నారు. మొత్తం రేషన్ బియ్యం వాళ్లు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నరు. రాష్ట్రంలో మీరు ఇచ్చేది 55శాతం మాత్రమే. అది మూడు రూపాయలకు ఇస్తరు. అందులో రెండు రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారుడికి పది కేజీల చొప్పున బియ్యం ఇస్తుందన్నారు. రూ.3610 కోట్ల ఖర్చుచేసి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నాం.. అలా అని సిఎం కెసిఆర్ ఫోటో పెట్టామంటారా అని ప్ర శ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రం నుం చి రూ.3 లక్షల 65వేల 797కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తుంది. కానీ, కేంద్రం నుం చి రాష్ట్రానికి వచ్చింది లక్షా లక్షా 96 వేల 400 కోట్లు మాత్రమే. కేంద్రానికి రాష్ట్రం నుంచి పో యింది ఎక్కువ. రాష్ట్రానికి వచ్చింది తక్కువ. దే శాన్ని, ఇతర రాష్ట్రాల ను సాకడంలో తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రభుత్వ వాటా ఉం ది. మరి తెలంగాణ ప్రతినిధిగా సిఎం కెసి ఆర్ ఫోటో ఆ రాష్ట్రాలలో పెడతారా అని నిలదీశారు. ఈ మధ్య కేంద్రంనుంచి వస్తోన్న మంత్రులు అబద్దాలు మాట్లాడుతున్నారు. నోరువిప్పితే అబద్ధాలే. మీరు మాట్లాడేది అర్థ సత్యాలు.. మేం మాట్లాడేది నగ్న సత్యాలు అన్నారు. బిజెపి ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తుందని అబద్ధాలు నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదు. అంటరు. మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాలు పారుతోందో మీకు తెలియదా.. కాళేశ్వరంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని అంటరు. మేమే అనుమతులు ఇచ్చినం అంటరు. ఒక్క ఎకరా పారలేదని అమిత్ షా మాట్లాడతరు. ఇన్ని పచ్చి అబద్దాలా.. అని హరీశ్ అశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులు మీరు మాట్లాడే మాటలు చూసి ఏమనుకోవాలి. జాతీయ స్థాయి నేతలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి అబద్ధ్దాలు మాట్లాడతరా.. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటడు.. జైలు కూలగొట్టిండ్రు.. హెల్త్ సిటీ ఏదన్నడు.. నేను పొటోలు పెట్టా. మళ్లీ మాట్లాడితే ఒట్టు. దానికి సమాధానం లేదు. నాలుగేళ్ల క్రితం ఎయిమ్స్ ఇస్తే తట్టెడు మట్టి ఎత్తలేదు. మేం హెల్త్ సిటీ పనులు 15 శాతం చేశాం. మూడుసార్లు నేను వెళ్లి సమీక్ష చేసా.. దిగజారుడు రాజకీయాలు.. పట్టపగలు పచ్చి అబద్దాలు మాట్లాడే పార్టీ బిజెపి అని దెప్పిపొడిచారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయని ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్ అంటున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదంటే నేను వెంటనే రాజీనామా చేస్తా.. లేదంటే మీరు చేస్తరా.. అని హరీశ్ ఘాటుగానే హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.150 కోట్లు ఎందుకు విడుదల చేసిందో మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వాలి. చేరలేదంటే నేను రాజీనామాకు సిద్ధః లేదంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అబద్ధాల మంత్రుల లిస్ట్‌లో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారన్నారు. మేం ఇంత చేసినం అంటున్నరు.. ఏం చేసిండ్రు చెప్పాలి. బిజెపి వచ్చిన తర్వాత దేశం మొత్తం దివాళా తీసింది. కేంద్రం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లుతోందన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం అధ్వానస్థితికి చేరుకుందన్నారు. వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై అపవాదులు మోపుతున్నారన్నారు. 2014లో 55వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 101వ స్థానానికి చేరింది. ఈ ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. గతంలో నాలుగు శాతం ఉన్న నిరుద్యోగ శాతం నేడు 11శాతానికి చేరిందన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మల సీతారామన్ గ్యాస్ ధరలు రూ.1200కు పెంచడం వల్లే మహిళలు ఒంటింట్లో కన్నీరు పెడుతున్నారన్నారన్నారు. రైతుకు ఆదాయం పెంచలేదు కానీ, పెట్టుబడులు పెంచిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాల ముందు రూపాయి విలువ తగ్గిపోతుందని, డాలర్ విలువ 63 రూపాయల నుంచి 80 రూపాయలకు పడిపోయిందన్నారు. భారతదేశంలో పౌరుల తలసరి ఆదాయం 144 స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ తిరిగి ఆనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న సీతారామన్ రోడ్డు పక్కన మా రైతులను అడగండి మా ప్రభుత్వం గురించి చెబుతారని సలహా ఇచ్చారు. సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Harish Rao slams Nirmala Sitharaman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News