Thursday, January 23, 2025

తెలంగాణ ఉద్యమాన్ని మోడీ కించపర్చారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లైన విభజన హామీలను పరష్కరించకుండా తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం హన్మకొండలో టి డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై విషం కక్కిన మోడీ.. ఇప్పుడు వలస జీవులపై విషం కాక్కడు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. నేడు తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలను కించపరిచారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే… అమరులకు కించపరచడం..ఉద్యమాన్ని కించపరచడమే. వరంగల్ లోనే ఎంత మంది బలిదానాలు చూసాము..ఎన్ని త్యాగాలు..ఎన్ని శవాలు మోసాము. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోడీ పని. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీ ఇస్తే ఎందుకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు. అందరూ వ్యతిరేకిస్తున్న కూడా వ్యవసాయ చట్టాలు ఎలా చేశారు.

కరోనా సమయంలో ఎంతో మంది వలస జీవులు బతికి ఉంటే చాలు అనుకుంటే.. మోడీ వారిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు. అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టారు. ఎంతో మంది నరకం చూసారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టీ, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారు. ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయి. అందరినీ అభినందిచల్సినది పోయి.. మోడీ విమర్శలు చేస్తున్నారు. వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగింది అని అవమాన పరిచారు. వలస జీవులపై ఎందుకు మోడీకి చిన్న చూపు. వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యింది. మీరు ట్రంపును తీసుకు వచ్చి, మీటింగ్ లు పెడితే, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ వలస కార్మికుల వల్ల పెరిగిందా. ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటదా. పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao Slams PM Modi’s remarks on Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News