Monday, December 23, 2024

కాంగ్రెస్ నాయకులకు కరెంట్ షాక్ ఇవ్వాలి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ట్వీటర్ వేదికగా స్పందిస్తూ.. “నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి.రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ. ధరణి వద్దు..రైతు బంధు వద్దు.. ఉచిత కరెంటు వద్దు అంటున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు అవసరమా?” అని పేర్కొన్నారు.

Also Read: రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News