Thursday, January 23, 2025

70 ఏండ్లలో సాధించని అభివృద్ధి 7 ఏళ్లలో సాధించాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో 70 ఏండ్లలో సాధించని అభివృద్ధి 7 ఏళ్లలో సాధించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమాలో రైతులకు భరోసా కల్పించామని, సిద్దిపేట జిల్లాలో 5 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, దళితబంధుతో దళితులు ఆర్థికంగా ఎదగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News