Monday, December 23, 2024

కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని… ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం నగరంలోని పీపుల్స్ టోల్‌ప్లాజా వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 466 అత్యవసర వాహనాలను(228 అమ్మ ఒడి, 204 అంబులెన్స్, 34 పార్థివ) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. “కొత్తగా వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. ప్రస్తుతం 70వేల మందికి ఒక అంబులెన్స్ ఉంది. అమ్మ ఒడి వాహనాలు కావాలని కోరగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు ఇచ్చారు. జననం నుంచి మరణం వరకు వైద్య, ఆరోగ్య శాఖ సేవలు అందిస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను కెసిఆర్ ఏర్పాటు చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖను నీతి ఆయోగ్ సైతం అభినందించింది. కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి ఉంది. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. కుటుంబ పెద్దగా కెసిఆర్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆశావర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే, వారికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయి. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్ చేయాలనుకుంటున్నాం. 108 ఉద్యోగులకు స్లాబులుగా వేతనాల పెంపు జరుగుతుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News