Sunday, December 22, 2024

టిఎస్‌పిఎస్‌సిలో 10 పోస్టులు మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నూతన సచివాలయంలో గురువారం సుమారు మూడు గంటలకు పైగా తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం.. సాయంత్రం 6:15 గంటల వరకు కొనసాగింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ చేపట్టే టిఎస్‌పిఎస్‌సిలో 10 పోస్టుల మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News