Wednesday, January 8, 2025

కెటిఆరే కాదు.. ఇంకా చాలామంది నేతలపై కేసులు పెడతారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ కేసులో నమోదైన కేసును కొట్టివేయాలని కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందినగర్ లోని కెటిఆర్ నివాసానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి కలిశారు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలని కెటిఆర్, హరీశ్ రావు లీగల్ టీమ్ చర్చించారు.

అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. “కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోంది. ఇంకా చాలామంది నేతలపై రేవంత్‌రెడ్డి కేసులు పెడతారు.తదుపరి కార్యాచరణపై న్యాయవాదులతో చర్చించాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోంది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించారు. రైతు భరోసా తగ్గింపుపై నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. రేవంత్‌రెడ్డి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడేది లేదు. ఈ కేసులో తప్పు జరిగిందని చెప్పి కోర్టు శిక్ష ఏమీ వేయలేదు. విచారణ జరుపుకోవచ్చని మాత్రమే హైకోర్టు చెప్పింది” అని హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News