Thursday, January 23, 2025

తెలంగాణకు ఎవరు కావాలి?: కట్టెటోడా..కూలగొట్టెటోడా?

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ జలదృశ్యమా..ప్రతిపక్షాల ఆత్మహత్యా సదృశమా?

ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాగు, తాగు నీళ్లు ఇచ్చింది మేమే
దేశమే అబ్బురపడేలా సచివాలయం లాంటి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం
అచ్చంపేట సభలో మంత్రి హరీశ్‌రావు

అచ్చంపేట: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డకుంలు సృ ష్టించిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులను సాధించారని అలాంటి కెసిఆర్ వెంట ఉంటే జలదృ శ్యం ఉంటుందని, ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్షాలకు వంత పాడితే ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం ఏర్పా టు చేసిన అచ్చంపేట ఎత్తిపోతల పథకం ఆమోదముద్ర వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు ధన్యవాద బహిరంగ సభను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో దేశమే అబ్బురపడే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా సెక్రటరియేట్‌ను నిర్మిస్తే ఒకరేమో కూల్చివేస్తామంటారు…మరొకరేమో బాంబు లు పెట్టి పెల్చేస్తామని బెదిరిస్తున్నారని కాంగ్రెస్, బిజెపిలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను కట్టేటోడు కావాలా..కూలగొట్టేటోడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని హరీశ్‌రావు అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడానికి ముందుకు సాగుతుంటే కాంగ్రెస్, బిజెపి లాంటి ప్రజా వ్యతిరేకులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు, భూ సేకరణలో అడ్డంకులతో ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చేసిన కుట్రలను చీల్చుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్‌లు నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రితో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధ్యమయ్యాయంటే స్వరాష్ట్రంలో ఉద్యమ నాయకుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలోని మోడీకి, రాహుల్ గాంధీలకు అచ్చంపేట ఎత్తిపోతల పథకం పట్ల చిత్తశుద్ధి ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే నేడు మారుమూల ప్రాంతమైన అచ్చంపేటకు 2300 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరైందన్నారు.

ఉమామహేశ్వర ప్రాజెక్టు, చెన్నకేశవ స్వామి ప్రాజెక్టు, ఆంజనేయ స్వామి ప్రాజెక్టు, నిరంజన్ షావళి లిఫ్ట్ ఇరిగేషన్‌ను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి నల్లమల బిడ్డలు ఎప్పుడు అండగా నిలవాలన్నారు. నేడు మే నెలలో మండుటెండలో ముఖ్యమంత్రికి కృతఙ్ఞత తెలపడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటే అచ్చంపేటలో గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా, మూడవసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ కూర్చోవడం ఖాయమన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి మంచి పరిహారంతో పాటు వెంటనే డబ్బులు మంజూరయ్యే విధంగా చూస్తామిన ఆయన హామి ఇచ్చారు. మీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అటు ముఖ్యమంత్రి, ఇటు నన్ను ఈ ప్రా-జెక్టు సాధించే వరకు నిద్ర పోనివ్వలేదని అన్నారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చింది కరువేనన్నారు. కెసిఆర్ వల్లే నేడు పాలమూరులో ప్రాజెక్టులు పూర్తై ఐదు జిల్లాలుగా ఏర్పడి ఎంతో అభివృద్ధి సాధించగలిగామన్నారు. అచ్చంపేట ప్రాజెక్టు పూర్తైతే ఈ ప్రాంత ప్రజలు ధనవంతులుగా మారుతారన్నారు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తి కావాలంటే మరోమారు కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయమన్నారు.

నాడు 30శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే నేడు సీన్ రివర్స్ అయి 70 శాతం ప్రభుత్వ ఆసుపత్రులలో, 30 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే నేడు రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ మొండికేసేవారని, నేడు ప్రభుత్వ ఆసుపత్రులలో 2వేల మంది డాక్టర్లను నియమించి 400 కోట్లతో ఎంసిహెచ్ ఆసుపత్రులను ఆధునీకరించడం జరిగిందన్నారు. బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు 13 వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసి ఈ విద్యా సంవత్సరమే తరగతులను కూడా నిర్వహించేలా చేయడం జరిగిందన్నారు. మండుటెండల్లో బిందె పట్టుకుని రోడ్లపైకి వెళ్లే పరిస్థితి లేకుండా మిషన్ భగీరథతో ఇంటిటికి నల్లా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కిందన్నారు. బిజెపి పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. చేరికల కమిటీ చైర్మెనే తమ పార్టీ పని అయిపోయిందని, తమ పార్టీలో ఎవరు చేరడం లేదని చెప్పడం గమనార్హమన్నారు.

కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గుండె గుండెకు చేరుకున్నాయన్నారు. ఇన్ని పథకాలు, ఇంత అభివృద్ధి ఏ పాలకులైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల డిపాజిట్లను గల్లంతు చేసి రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసన స-భ్యులు గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, జెడ్పి చైర్‌పర్సన్ శాంత కుమారి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News