Saturday, November 23, 2024

ఏ అంశంలోనైనా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Speech at Aler Yuvajana Vidyarthi meeting

యాదాద్రి భువనగిరి: ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆలేరు నియోజకవర్గ యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగం సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”బిజీపి ఫేక్ వాట్సప్ ప్రచారం చేస్తుంది. బిజెపి నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారు.తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానం లో ఉంది. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే వాళ్ల యూపీ అట్టడుగున ఉంది. ఇక్కడి బండి, గుండు మాటలు చెప్పుమంటే కోటలు దాటుతయి. మేం అడ్డుకుంటే ఒక్కరు కూడా తిరుగలేరు బయట. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేమంటే.. 7 లక్షల ఉద్యోగాలే ఖాళీ ఉన్నాయి అంటరు. కనీసం ఇదన్న ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం గురించి సీఎం కేసీఅర్ ఏం తప్పు మాట్లాడారు.  నేను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారనీ, అవసరం అయితే రద్దు చేయాలి అని అంబేడ్కరే చెప్పారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి పోతుందని న్యాయం చేయాలి అంటున్నాం. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచాలి అంటే పట్టించుకోరు. బిజెపి అంటేనే కోతలు.. కోతలు తప్ప ఏం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే వాతలు పెడుతారు. పెట్రో డీజిల్ గ్యాస్ ధరలు పెంచడానికి సిద్దంగా ఉన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు ఒకటన్న ఉందా..కేంద్రం తెలంగాణను చిన్న చూపు చూస్తుంది. ఇక్కడి బీజెపి నేతలకు నైతికత లేదు. ముల్లును ముల్లు తోనే తీయాలి. అంత కంటే గట్టి సమాధానం చెప్పాలి. తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టాలి” అని అన్నారు.

Harish Rao Speech at Aleru Yuvajana Vidyarthi meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News