Monday, December 23, 2024

రైతు రుణమాఫీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బడ్జెట్ లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు పాలనలో కూడా అబద్దాలు చెబుతున్నారని..  రైతులను ఈ సర్కార్ మోసం చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ.. బడ్జెడట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందన్నారు. రైతు రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని.. రైతుబంధును బంద్ పెట్టేలా సర్కార్ ఆంక్షలు పెడుతోందని విమర్శించారు.

గతంలో మేము రూ.40 వేల కోట్ల అప్పులు తీసుకుంటే.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.59,625 కోట్లు అప్పుగా తెస్తామని బడ్జెట్‌లో చెప్పారని హరీష్ రావు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News