Wednesday, December 25, 2024

బిఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః తెలంగాణలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం జిల్లాలోని పటాన్‌చెరులో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్రీడం పార్కు, గ్రేటర్ డివిజన్ కార్యాలయం, డిసిసిబి బ్యాంకు కార్యాలయం, ఆర్‌అండ్‌బి అతిథి గృహాన్ని మంత్రి హరీశ్ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. “ఐటి సేవల విస్తరణకు పటాన్‌చెరు కేంద్రం కాబోతోంది. ప్రతిక్షాలు అధ్యక్షులను మార్చినా బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఆగదు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసింది. దక్షిణ భారత్‌పై బిజెపికి చిన్నచూపు ఎందుకు?. ప్రజల ఆకాంక్షల మేరకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్లీ గెలిచాక పటాన్‌చెరుకు మెట్రో ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు” అని తెలిపారు.

Also Read: సీతక్కను సిఎం చేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News