Monday, November 18, 2024

ఎన్నికల కోడ్ కంటే ముందే పథకాలు లాంచ్ చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారంటీలపై గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్లను ఎలా తీసుకుంటారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలు పెట్టామని చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే విషయంపై క్లారిటీ లేదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల పోటీపై క్లారిటీ వచ్చిన తర్వాత మా అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు.

లోక్ సభ ఎన్నికల కోడ్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు లాంచ్ చేయాలన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేవరకు కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ కంటే ముందే పథకాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ.. దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతున్నారని.. ఓడిపోయినవారి చేత రిబ్బన్ కట్టింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైంతుబంధు ఎంతవరకు ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాజెక్టులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని హరీష్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News