Monday, December 23, 2024

ప్రజల గుండె మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్టుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారని, విద్యుత్ కోతలను నిరసిస్తూ తరచూ నిరసన ప్రదర్శనలు జరిగేవన్నారు. గతంలో ఎంఎల్‌ఎలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పండిందన్నారు. బిందెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారని, నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయిబాధపడేవారని, ప్రజల గుండె మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరని హరీష్ రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News