Sunday, December 22, 2024

అలా చేస్తే.. గజ్వేల్ లోనే ఉండాలని కెసిఆర్ ను ఒప్పిస్తా: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ లో ముఖ్యమంత్ర కెసిఆర్ పోటీ చేయడం మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని గజ్వేల్ ప్రజలను ఉద్దేశిస్తూ మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావుకు ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతులు వివిధ వైశ్య సంఘ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్ గౌరవాన్ని, ప్రతిష్టను సిఎం కెసిఆర్ పెంచారని అన్నారు. మొన్నటి దాకా గజ్వేల్ కు గూడ్స్ రైలు వచ్చిందని, ఇవాళ్టి నుంచి ప్యాసింజర్ రైలు నడవటం ప్రారంభం అయ్యిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి కోట్లు వెచ్చించి సిద్ధిపేట జిల్లాకు రైలు తెచ్చుకున్నామని ఆయన తెలిపారు. గజ్వేల్ లో ఎక్కువ మెజారిటీతో సిఎం కెసిఆర్ ను గెలిపిస్తే కామారెడ్డి నుంచి వద్దు గజ్వేల్ లోనే ఉండాలని కెసిఆర్ సారును ఒప్పించే పూచీ నాదని చెప్పారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని, లక్ష ఓట్ల మెజారిటీతో సిఎం కెసిఆర్ ను గెలిపించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News