Sunday, January 19, 2025

అభివృద్ధిలో రంగారెడ్డి దూసుకపోతుంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఇక్కడ ఆస్పత్రి నిర్మాణానికి కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. తహాసిల్దార్, ఆర్ డిఒ భవనాలను రూ. 4.5 కోట్లతో నిర్మించిన రామోజీ ఫౌండేషన్ కు, సంస్థ ఛైర్మెన్ రామోజీ రావుకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో నూతన తహాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంబించారు.  బాధితుల పక్షాన నిలవడంలో ఈనాడు, ఈటివి సంస్థలు ఎప్పుడు ముందు ఉంటాయని ప్రశంసించారు.  ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవడం అభినందించదగ్గ విషయమని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని, హైదరాబాద్ ను చూస్తే న్యూయార్క్ నగరంలా కనిపిస్తున్నదని ఒక సందర్భంలో సినీహీరో రజనీకాంత్ అన్నారని, కేంద్ర ప్రభుత్వ అవార్డులు తెలంగాణకు ఎన్నో వస్తున్నాయని మెచ్చుకున్నారు. ధాన్యం ఉత్పత్తిలో,  వైద్యుల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలియజేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వివరించారు.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో లాడ్జ్‌లో భార్య…

కెసిఆర్ మరోసారి సిఎం కావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య లేదని, 9 ఏళ్లలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేశామని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చే మెడికల్ కాలేజీతో వైద్యం, వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని, మాతృ మరణాలు తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఈనాడు ఎండి కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News