Sunday, January 19, 2025

రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట : మిట్టపల్లి గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిందని, అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, సద్దితిన్న రేవు తలవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కుల సంఘ భవనాలకు మంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ మేరకు ముదిరాజ్ రూ.40 లక్షలు, యాదవ సంఘం రూ.50 లక్షలు, గౌడ సంఘం రూ.30 లక్షలు, వడ్డెర సంఘం రూ.20 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘం రూ.30 లక్షలు, ఎస్సీ మాల సంఘం మిగులు పనులకు రూ.12 లక్షలు నిధులు మంజూరు చేస్తూ.. ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధికై తన కుటుంబంలా భావించి ప్రజలకు సేవ చేస్తున్నట్లు.. ప్రజాసేవలో సిద్ధిపేటను అన్నింటా ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేట ఖ్యాతిని ఇనుమడింప చేసి పెంచామని.. ఆ సేవను ప్రజానీకం గుర్తించాలని కోరారు. మిట్టపల్లి గ్రామం నుంచి సిద్ధిపేట వరకూ ఫోర్ లేన్ రహదారి వస్తున్నదని, హైటెక్ సిటీగా మారిందని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రి వర్యులు హరీశ్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నాడని, కుల సంఘ భవనిర్మాణాలకు మంత్రి హరీశ్ చేసే సేవలు మరువలేవని, ఈ సారి జరిగే ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మండల పలువురు ప్రజాప్రతినిధులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News