Saturday, December 21, 2024

మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే: మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుకి సిద్దిపేట శివాజీ సర్కిల్ నుండి రాఘవాపూర్ వరకు విద్యార్తి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహనికి మంత్రి హరీష్ రావు పూల మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. ”మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కువే, ఇంకా మీకు చాలా సేవ చేయాలి. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు, చివరి శ్వాస వరకు సేవ చేస్తా. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే. ఈ గడ్డ గులాబీ అడ్డా.
రానే రాదు అన్న తెలంగాణను, కానే కాదు అన్న కాళేశ్వరంను కట్టి మండుటెండల్లో మత్తల్లు దుంకిస్తున్నాడు కెసిఆర్. వెనుకట పంట వేయాలి అంటే మోగులు వైపు చూసేది, నేడు కెసిఆర్ దయవల్ల కాలంతో సంబంధం లేకుండా పంట వేయవచ్చు. 138కోట్ల రూపాయల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పండితే నేడు 1548కోట్లు రూపాయల వడ్లు పండుతున్నాయి.

కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయి. రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదు. నేడు ప్రతి ఇంట్లో కెసిఆర్ ఉన్నాడు. కాళేశ్వరం దండగా అన్న ప్రతిపక్షాలు గ్రామాలలోకి వస్తె పండగో, దండగో తెలుస్తుంది. మోడీ నిన్న సభలో రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశాడు. మోడీ.. దొంగే దొంగా అన్నట్లు మాట్లాడాడు. మోడీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం అపిండు. కరెంట్ మోటార్లుకు మీటర్లు పెట్టాలని 30వేల కోట్లు ఆపిండు. తెలంగాణ అభివృద్ధినీ బీజేపీ అడ్డుకుంటుంది.

ఉత్తర ప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. రెండు కోట్లతో పుల్లుర్ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం అభివృద్ధి చేసుకున్నాం. త్వరలోనే గృహ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పించడ్లు ఇవ్వలేదు. గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలలో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి అందిస్తాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News