Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే కెసిఆర్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించిందని కెసిఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సభలో చర్చ సందర్భంగా అన్నారు. 14 నెలలకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి వైదొలిగామని పేర్కొన్నారు. ఆరు కారణాలతో మేం ఆరోజు రాజీనామా చేశామన్నారు. వైఎస్ హయాంలో తమతో ఉన్నది పిజెఆర్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికార భిక్షపెట్టిందే కెసిఆర్ అన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపాలని కొట్లాడినప్పుడు ఒక్కరు కలిసిరాలేరని మండిపడ్డారు. కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్న హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News