Monday, December 23, 2024

మంథని అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao started a 50-bed hospital in Manthani

 

మంథని: మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఏడు కోట్ల రూపాయలతో మంథని ప్రభుత్వ ఎంసిహెచ్ ఆసుపత్రిని నిర్మించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లండించారు. ప్రభుత్వం ఎం సి హెచ్ హాస్పిటల్ తీసుకురావడం ద్వారా 60 శాతం ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిపారు. కేరళ, తమిళనాడు తర్వాత పేదల ఆరోగ్య విషయంలో నాణ్యమైన వైద్యం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ఆరోగ్య సంచికలో చిట్టచివరి స్థానంలో ఉందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని మండిపడ్డారు. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కేవలం తెలంగాణ రావడం వల్లనే పూర్తి అయిందని.. ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీల వల్ల కానే కాకపోవన్నారు. నిరుద్యోగ యువతను కేంద్రంలో ని బీజేపీ సర్కార్ మోసం చేస్తుందన్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెన్షన్ ఉండదు.. ఉద్యోగ భద్రత ఉండదు.. బీజేపీ సైన్యాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తుందన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ రద్దు చేయమని పోరాటం చేసే యువత ను బ్లాక్ మెయిల్ చేస్తూ.. కేసులు పెట్టి అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ మహిళలను మోసం చేసి 400 రూపాయలు సిలిండరు వెయ్యి రూపాయలు చేసిందన్నారు. రైతు నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసి రైతులను కూడా మోసం చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ నిర్ణయాలతో 750 మంది రైతుల ఉసురు పోసుకున్నదని మండిపడ్డారు. ఎల్ఐసీ, బిఎస్ఎన్ఎల్, రైల్వేలను చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ వల్లే రామగుండం మెడికల్ కాలేజ్ మంజూరుఅయిందన్నారు. రామగుండం, జగిత్యాల మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పుట్ట మధు ఓడిపోవడం దురదృష్టకరం అయినా పార్టీ కడుపులో పెట్టుకుని జడ్పీ చైర్మన్ చేసి కాపాడుకుందని, మంథని అభివృద్ధిని ముందుకు తీసుకెళుతోందన్నారు. లధనాపూర్ ఆర్ అండ్ ఆర్ నిర్వాసితుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మళ్లీ మంథని గడ్డమీద గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి కపడుకుంటమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News