నాడు రామదండు… నేడు గులాబీ దండు…
రేవంత్ సర్కార్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలింది
కాంగ్రెస్ మోసపూరిత, అబద్ధపు హామీలను పాదయాత్రలో ప్రజలకు వివరించాలి
పదేళ్ల మా పాలనలో అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శం
బిఆర్‌ఎస్ పార్టీ రథోత్సవం కోసం సిద్దిపేట నుండి 1500 మంది పాదయాత్ర
తెలంగాణ ఉద్యమానికి, సిద్దిపేటకు అభినావభావ సంబంధం
ఈ పాదయాత్ర కాంగ్రెస్‌కు చెంపపెట్టు కావాలి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు
మన తెలంగాణ/ సిద్దిపేట అర్బన్: నాడు లంకలో రావణుని అరాచకాలు అరికట్టడానికి రామదండు కదిలితే ..నేడు తెలంగాణలో రేవంత్ సర్కారు అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం నుండి వరంగల్ సభకు వెయ్యి మంది విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి బయలుదేరే ముందు అమరవీరులకు నివాళులర్పించి జెండా ఊపి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అంతకుముందు కాశ్మీర్ పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అభినాభావ సంబంధం ఉందన్నారు. 2001లో బిఆర్‌ఎస్ ప్రారంభమైన తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్దిపేట ప్రాంతం తెలంగాణకు పేగు బంధంగా ఉందన్నారు. ఈ పాదయాత్ర రానున్న రోజుల్లో పార్టీ అధికారంలో రావడానికి విజయ యాత్రగా కాబోతుందని జోస్యం చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం ఏ పాత్ర అయినా బిఆర్‌ఎస్ తెలంగాణ పక్షమేనన్నారు. పదేండ్ల తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో, జిఎస్‌డిపిలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపామని అన్నారు. డాక్టర్ల తయారీలో కూడా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిచెప్పిన మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు.
ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడే పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. ఈ పాదయాత్ర కాంగ్రెస్‌ఉ చెంపపెట్టు కావాలన్నారు. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి కదిలిందని అన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి అందరూ క్రమశిక్షణతో ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా నడవాలని, ఎవరికి చిన్న ప్రమాదం కానీ గాయం కానీ జరిగితే తన గుండె బాధపడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నానని అన్నారు.
పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ అరాచకాలను వివరించాలని అన్నారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్నాల వారీగా టీములు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. అన్ని వసతులను ఏర్పాటు చేపి కంటికి రెప్పలా చూసుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పర్యవేక్షిస్తునే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, పూజల వేంకటేశ్వర్లు, కొండం సంపత్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వంగ తిరుమల్ రెడ్డి, మేర్గు మహేష్, రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జువ్వన కనకరాజు, గ్యాధరి రవి, నాగుల ప్రశాంత్, సద్ది నాగరాజు రెడ్డి, బర్ల మల్లికార్జున్, పాల సాయిరాం, గోవిందారం రవి, మరుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.