సిద్ధిపేట: రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో అన్నీ స్పోర్ట్స్ లకు కావాల్సిన వసతుల కల్పన చేపడతానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు-నెక్లెస్ రోడ్డున జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్పోర్ట్స్ అవసరమని, క్రీడల ఆవశ్యకతను వివరించారు. ఇప్పుడిప్పుడే సమాజం యోగ, క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ.. దృష్టి సారించడం శుభపరిణామమని మంత్రి అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేటలో క్రికెట్ స్టేడియం, ఫుట్ బాల్, వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్ లు, క్రీడాకారులను బహుమతులు అందిస్తూ.. మంత్రి ఘనంగా సన్మానించారు.
Harish Rao Starts 2K Run in Siddipet