Saturday, December 21, 2024

నిమ్స్ కొత్త బ్లాక్ భూమి పూజ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -
సభ ఏర్పాటు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్: ఈనెల 14న వైద్యరోగ్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భూమి పూజ చేసే నిమ్స్ కొత్త బ్లాక్ వద్ద వైద్య, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సోమవారం భూమిపూజ అనంతరం నిర్వహించే సభ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. వచ్చిన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వైద్యరోగ్య దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిమ్స్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.1571 కోట్లతో నిర్మించబోయే 2వేల పడకల ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.

జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను పరామర్శించిన మంత్రి హరీష్‌రావు 

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉద్యమ సమయంలో మీ పాట ద్వారా చేసిన సేవలు మరిచిపోలేమని కొనియాడారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామ నరసయ్య అనారోగ్యంగా ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి, నిమ్స్ కు తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన విషయం తెల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News