Saturday, November 23, 2024

‘ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ హై..’: హరిశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao takes Tea at Huzurabad City Palace

హుజురాబాద్: నియోజకవర్గంలో సాయంత్రం సిటీ ప్యాలెస్ వద్ద మంత్రి హరీశ్ రావు చాయ్ తాగి కాసేపు సరదాగా గడిపారు. శనివారం హుజురాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా హుజురాబాద్ సిటీ ప్యాలెస్ వద్ద కారు ఆపి సిటీ ప్యాలెస్ కి వెళ్లి మంత్రి హరీష్ రావు చాయ్ త్రాగారు.  ‘క్యా అబ్దుల్ భాయ్ ఖైసేహో… ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ రహేత బొల్కే సునా.. మీ దగ్గర చాయ్ బాగుంటుందట అందుకే ఆగాను, గిరాకీ ఎలా అవుతోంది.. ఎన్నికల వేళ బాగుందా’ అంటూ హరీశ్ రావు ప్యాలెస్ యాజమానితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి వారి మనసు దోచుకున్నారు. ‘సార్ ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న.. మీరూ మా హోటల్ లో చాయ్ త్రాగాలి అని, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీతో ఒక సెల్ఫీ దిగాలి అని నా కోరిక సర్’ అంటూ యజమాని హరీశ్ రావుతో సెల్ఫీ దిగారు. ‘ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ హై’.. మరో సారి వస్తా అంటూ మంత్రి హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Harish Rao takes Tea at Huzurabad City Palace

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News