Wednesday, November 13, 2024

అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో అయిల్ ఫామ్ సాగే లక్షం
సాగుపై ప్రత్యేక శ్రద్ద వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి
వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చోరవ చూపాలి
టెలికాన్పరెన్స్‌లో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: అయిల్ ఫామ్ తోటల సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం అయిల్ ఫామ్ సాగుపై సిద్దిపేట జిల్లాకు చెందిన 4200 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులతో ఆయన టెలికాన్పరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అయిల్ ఫామ్ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చోరవ చూపాలన్నారు. ఈ పంటకు అంతర్జాతీయ స్ధాయిలో అధిక డిమాండ్ ఉందని దీంతో రైతులకు ఉజ్వల భవిష్యత్తుతో పాటు లాభదాయకంగా ఉంటుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు విన్నూత రితీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో అయిల్ ఫామ్ సాగు చేసే లక్షంగా ముందుకు సాగుదామన్నారు. జిల్లాలో 10 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 3215 ఉన్నారని వీరిమొత్తం భూమి 50112 ఎకరాల మేర అయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయా రైతులంతా అయిల్ ఫామ్ సాగు కోసం ముందుకు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చోరవ చూపాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతుబంధు సమితి నాయకులు సమన్వయంతో ముందుకు సాగితే అనుకున్న లక్షం దిశగా చేరుకోవచ్చన్నారు.

బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిట్‌మెంట్
జిల్లాలోని పలు బ్యాంకులలో రుణం పొంది బాధపడే రైతులకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శుభవార్త చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చోరవతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల మంది రైతులకు రుణ విముక్తి కలగనున్నది. జిల్లా బ్యాంకర్లతో సమావేశమై చర్చించిన అనంతరం మంత్రి అదేశాల మేరకు బ్యాంకర్లు స్పెషల్‌డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ బ్యాంకులు ముందుకొచ్చాయి.

ఈ మూడు బ్యాంకులలో పాత మొండి బకాయిలు క్రాప్‌లోన్, ఆగ్రిలోన్, గ్రూప్‌లోన్, ఇతరాత్ర రుణాలు తీసుకొని మొండి బకాయిలుగా ఉన్న రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి రుణ విముక్తి చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన జాబితాను సంబంధిత గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అధికారులకు త్వరలోనే అందజేయనున్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ విముక్తి పొందిన రైతులు రెండు నెలల్లో క్రాప్‌లోన్లు తీసుకోవచ్చునని తెలిపారు.

Harish Rao teleconference on Palm Oil Cultivation in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News