సిద్దిపేట: పదో తరగతి పలితాలలో గత ఏడాది తరహాలో ఈ యేడు సైతం సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిలుపుదామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పదవ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, ప్రదానోపాద్యాయులు, ఎంఈఓలు, డిఈఓలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవతర్సంలో రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నివాలన్నారు.
ఈ యేడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి పదవ తరగతి చదువుతున్న విద్యార్ధుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్ధులందరికి అందిజేసినట్లు తెలిపారు. డిజిటల్ కంటెంట్ విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆల్పాహారం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహణతో విద్యార్ధుల మేదస్సుకు పదను పెట్టాలన్నారు. పిల్లల జీవితం మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలు కాబట్టి పాఠశాలలోనే కాదు ఇంటి వద్ద కూడా విద్యార్ధులు ప్రశాంత వాతావరణంలో చదువకునేలా తల్లిదండ్రులు సహకారాన్ని అందించాలని నేరుగా విద్యార్ధుల తల్లిదండ్రులకు మంత్రి సూచించారు.
గతేడాది స్పూర్తితో మూడు నెలల ముందు నుంచే స్వయంగా మంత్రి జిల్లా స్ధాయి సమీక్షలు నిర్వహించామని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాదించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని సూచనలు చేసినట్లు తెలిపారు. పలువురు పదవ తరగతి తల్లిదండ్రులతో మీ బిడ్డ ఉదయం 5 గంటలకు లేచి చదువుతున్నారా చదివేలా మీరు ప్రోత్సహించాలన్నారు. రెండు నెలల వరకు టీవి, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని సూచించారు. 10/10 జీపీఎ సాదించే విద్యార్ధులకు రూ. 10 వేలు నగతు బహుమతిగా అందిస్తానన్నారు. ఈ పాఠశాల ఉపాద్యాయ బృందాన్ని కూడా ఘనంగా సన్మానిస్తామన్నారు.