Sunday, November 17, 2024

రేపు హుజురాబాద్ లో కెసిఆర్ ఆటోనగర్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలోని 330 మంది కార్మికులకు సొంతంగా షేడ్లు వేసుకుని తమ జీవనం కొనసాగేందుకు గాను కరీంనగర్ రోడ్డులో కాకతీయ కాలువ పరిసరాల్లోని ఎస్ఆర్ఎస్పి స్థలంలో కెసిఆర్ పేరుతో ఆటో నగర్ ఏర్పాటు చేస్తుండడంతో పట్టణంలోని కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ పట్టణంలో 11 సంస్థలకు చెందిన కార్మికులు ఆయా రంగాల్లో రోజు వారీ పనుల్లో నిమగ్నం అవుతూ జీవనం సాగిస్తున్నారు. పూర్తిగా పట్టణ నడి ఒడ్డున ఇండ్ల మధ్యనే వ్యాపారాలు చేస్తుండడంతో కాలుష్యాన్ని వేదజల్లడం, సౌండ్స్ ద్వారా ప్రజలకు ఎంతో ఇబ్బందులు ఉండేవి.. రోడ్లపై వ్యాపారులు ఇబ్బందులు పడేవారు, పోలీసులు సైతం అనేక సార్లు కేసులు నమోదు చేశారు. చాలి చాలని జీవితాలు, అద్దెకు ఉంటు జీవనం సాగిస్తున్నారు. ఈ ఇబ్బందులు ఉండడంతో వ్యాపారులు 20 ఏళ్లుగా తమకు ప్రభుత్వ స్థలాలు కావాలని ఎన్నోసార్లు వినతులు చేసినా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఈ పరిస్థితుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం, ఈ సమీకరణాల్లో భాగంగా పలువురు మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రులు 330 మంది కార్మికులకు అనువైన స్థలం ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దింతో కరీంనగర్ రోడ్డులో కాకతీయ కాలువ ప్రక్కన 10 ఎకరాలు భూమిని చదును చేశారు. ఇందులో మోటర్ ఫిల్డ్ కు చెందిన 11 సంస్థలు ఉన్నాయి. మోటర్ మెకానిక్, ట్రాక్టర్, లారీ, వర్క్ షాప్, ట్రాలీ, ఆటో, గ్యాస్ వెల్డింగ్, వెల్డర్, హార్ వెస్టర్ కు చెందిన వారికి ఈ స్థలాన్ని కేటాయింపు చేశారు. మొదట ఇందులో కరెంట్, రోడ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము నాయకులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని మెకానిక్ లు పేర్కొన్నారు. ఈ నెల 5న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లు ఈ ఆటో నగర్ ఏర్పటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Harish Rao to Inaugurate KCR Auto Nagar in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News