ఎంఎల్‌ఎల పనితీరుపై పీపుల్స్‌పల్స్,
సౌత్, వెస్ట్ వెబ్‌సైట్ సంస్థల సంయుక్త
సర్వేలో వెల్లడి టాప్10లో ఐదుగురు బిఆర్‌ఎస్‌కు చెందిన
ఎంఎల్‌ఎలే కెసిఆర్‌కు రెండో ర్యాంక్ మంత్రి శ్రీధర్‌బాబుకు
మూడో ర్యాంక్ తొమ్మిదవ ర్యాంక్‌లో ఉత్తమ్‌కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రం లో 15 నెలల ఎంఎల్‌ఎల పనితీరుపై పీ పుల్స్ పల్స్-, సౌత్ ఫస్ట్ వెబ్‌సైట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ మినహా అన్ని ని యోజకవర్గాల్లో ఎంఎల్‌ఎల పనితీరుపై సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం 24 ఎంఎల్‌ఎల పనితీరు బాగుందని, 36 మంది ఎంఎల్‌ఎల పనితీరు బాగోలేద ని, 58 మంది ఎంఎల్‌ఎల పనితీరు ప ర్వాలేదని వెల్లడైంది. ఈ సర్వేలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట శాసనభ్యు లు, మాజీ మంత్రి టి.హరీష్‌రావు మొ దటి స్థానంలో నిలువగా,అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎంఎల్‌ఎల పనితీరు బాగోలేదని, 37 మంది ఎంఎల్‌ఎల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలలో 12 మంది ఎంఎల్‌ఎల పనితీరు బాగుందని, 13 మంది ఎంఎల్‌ఎల పనితీరు బాగోలేదని, 13 మంది ఎంఎల్‌ఎల పనితీరు పర్వాలేదని తేలింది. అలాగే బిజెపి పార్టీకి సంబంధించి ముగ్గురు ఎంఎల్‌ఎల పనితీరు బాగుందని, ఒక ఎంఎల్‌ఎ పనితీరు బాగోలేదని, నలుగురు ఎంఎల్‌ఎల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. అదేవిధంగా ఎంఐంఎం ఎంఎల్‌ఎలలో ఇద్దరు ఎంఎల్‌ఎల పనితీరు బాగుందని, ఇద్దరు ఎంఎల్‌ఎల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎంఎల్‌ఎల పనితీరు పర్వాలేదని తేలింది. సిపిఐకి చెందిన ఒకే ఒక ఎంఎల్‌ఎ పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది.
టాప్ టెన్‌లో 2వ స్థానంలో కెసిఆర్…7వ స్థానంలో కెటిఆర్
రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది టాప్ ఎంఎల్‌ఎలలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీష్‌రావు ప్రథమ స్థానంలో, బిజెపికి చెందిన కామారెడ్డి ఎంఎల్‌ఎ వెంకటరమణ రెడ్డి 10 స్థానంలో నిలిచారు. టాప్ టెన్ ఎంఎల్‌ఎలలో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కెసిఆర్ 2వ స్థానంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ 7వ స్థానంలో ఉన్నారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి 5వ స్థానంలో, జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. టాప్ టెన్ ఎంఎల్‌ఎలలో ఐదుగురు బిఆర్‌ఎస్‌కు చెందిన వారుకాగా, ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు, ఇద్దరు బిజెపి, ఒకరు ఎంఐఎం పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు ఉన్నారు. టాప్ 10లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని ఎంఎల్‌ఎ, మంత్రి శ్రీధర్ బాబు 3వ స్థానంలో ఉండగా, హుజుర్‌నగర్ ఎంఎల్‌ఎ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9వ స్థానంలో నిలిచారు. బిజెపికి చెందిన ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ 8వ స్థానంలో, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ చంద్రాయణ గుట్ట ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసీ 4వ స్థానంలో ఉన్నారు.
బిసి ఎంఎల్‌ఎల్లో టాప్ 3లో మంత్రి పొన్నం ప్రభాకర్
బిసి సామాజికవర్గానికి సంబంధించి టాప్ 10 ఎంఎల్‌ఎలలో బిజెపికి చెందిన ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ మొదటి స్థానంలో నిలిచారు. అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ 2వ స్థానంలో, బిసి శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎంఎల్‌ఎ పొన్నం ప్రభాకర్ 3వ స్థానంలో ఉన్నారు.అలాగే ఎస్‌సి సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, మధిర ఎంఎల్‌ఎ మల్లు బట్టి విక్రమార్క మొదటి స్థానంలో నిలిచారు. చొప్పదండి ఎంఎల్‌ఎ మేడిపల్లి సత్యం 2వ స్థానంలో, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఎస్‌టి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క మొదటి స్థానంలో నిలువగా, ఇల్లందు ఎంఎల్‌ఎ కోరం కనకయ్య 2వ స్థానంలో, పినపాక ఎంఎల్‌ఎ పాయం వెంకటేశ్వర్లు 3వ స్థానంలో ఉన్నారు. మహిళా ఎంఎల్‌ఎల్లో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహేశ్వరం ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో నిలువగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎంఎల్‌ఎ, మంత్రి సీతక్క రెండో స్థానంలో, బిఆర్‌ఎస్ నర్సాపూర్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి 3వ స్థానంలో నిలిచారు.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు 118 నియోజకవర్గాల్లో సర్వే
పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్‌సైట్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎ పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుండి 500 సాంపిల్స్‌ను సేకరించి కంప్యూరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ (క్యాటీ)/ ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించి ఎంఎల్‌ఎల పనితీరుపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. కేవలం ఎంఎల్‌ఎ పనితీరు ఎలా ఉంది అనే అంశంపైన మాత్రమే ఈ సర్వే నిర్వహించాము తప్ప ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు అనే అంశంపైన మాత్రం కాదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వేలో మినహాయించినట్లు పేర్కొన్నారు.